అందాల చందమామ కాజల్ అగర్వాల్, టాలీవుడ్ క్యూటెస్ట్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీలీల, కాజల్ డ్యాన్స్‌లతో రచ్చ లేపుతున్నారు. మే నెలలో షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి.. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మరియు స్టంట్ డైరెక్టర్ వెంకట్ మాస్టర్‌లతో కలిసి బాలయ్య పాటకు కొన్ని అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత కాజల్, శ్రీలీల వంతు వచ్చింది. సెట్‌లో బాలకృష్ణ సూపర్ హిట్ పాటకు హీరోయిన్లిద్దరూ డ్యాన్స్ చేశారు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ నాయుడులోని ‘చిలకపచ్చ కోకా’ పాటకు కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల చిందులేశారు. ఇందులో కథానాయికలు ఇద్దరూ పింక్ షర్టులు, బ్లూ జీన్స్ ధరించారు. నేను వేసిన డ్యాన్స్ కు జెలస్ గా ఫీలై.. మా హీరోయిన్స్ ఇద్దరూ నాముందు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అని అనీల్ రాసుకొచ్చారు. ఆ వీడియో ఆకట్టుకుంది.
ఇక తెలంగాణలో పూల పండగ ‘బతుకమ్మ’ సందడి ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు ఊరూవాడా సందడి నెలకొంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాలు పంచుకుంటారు. ఇందులో భాగంగా యువతులు రకరకాల పూలను సేకరించి వాటితో బతుమ్మను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రముఖ సినీ నటులు శ్రీలీల , కాజల్ అగర్వాల్ బతుకమ్మ ఆడి అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హనుమకొండలో నిర్వహించారు. బాలకృష్ణ, కాజల, శ్రీలీల సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల, కాజల్ స్టేజ్‌పై బతుకమ్మ ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.