Sr NTR : సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఆశామాషీ కాదు. దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుని దర్శకులను సెట్ చేసుకుని వాటికి తగ్గట్టు శారీరకంగా మానసికంగా సిద్ధపడటమనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. సినిమా పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. . దానవీరశూరకర్ణ లాంటి ఎపిక్ మూవీలో మూడు పాత్రలు వేసి నిర్మాణ బాధ్యతలతో సహా అన్నీ చూసుకుని నెలన్నర వ్యవధిలో అంత పెద్ద గ్రాండియర్ ని పూర్తి చేయడం ఇప్పటికీ రికార్డే. ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలు అందించారాయన.
ఇక ఎన్టీఆర్ కాక ఆయన తనయులని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. మొదటగా ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణ లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా మరో ఇద్దరు కుమారులను నిర్మాణ రంగంలోకి దింపాడు. ఒక కుటుంబం నుండి ఇంత మంది సినీ పరిశ్రమలోకి రావడంతో చాలా విమర్శలు వచ్చాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా టాలెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ నిలబడతారని భావించి తన కుమారులకి సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఎన్టీఆర్‌ని చూసి అక్కినేని నాగేశ్వరరావు ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే నాగార్జునను సినీ రంగంలోకి దింపారు.
ఇక అక్కినేని .. సూపర్ స్టార్ కృష్ణకు రమేష్ బాబును హీరోగా ఎంట్రీ ఇప్పించాలని సలహా ఇచ్చారు. ఆ సలహాతో సూపర్ స్టార్ కృష్ణ కూడా రమేష్ బాబును రంగంలోకి దింపారు. అయితే రమేష్ బాబు అంతగా రాణించలేక మధ్యలోనే సినిమాలు వదిలేశాడు. అయితే కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. అలా ఎన్టీఆర్ బాటలో నడిచి అక్కినేని, కృష్ణ తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ వారసులు, దగ్గుబాటి వారసులు, మంచు మోహన్ బాబు వారసులు ఒకరి తరవాత ఒకరు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.