Speaker Gaddam Prasad Kumar : నువ్వు కొత్త‌గా వ‌చ్చిన‌వ్‌.. కామ్‌గా కూర్చో అంటూ పాడి కౌశిక్‌కి స్పీక‌ర్ గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశారుగా..!

Speaker Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీలో ఎంత ర‌చ్చ జ‌రిగిందో మ‌నం చూశాం. కేటీఆర్ వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి అన్న‌ట్టుగా స‌భ జ‌రిగింది. . గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు వైఫల్యాలను ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి చూపారు. రైతు బీమా, పంట గిట్టుబాటు ధర, సాగు నీటి ప్రాజెక్టులు, టీఎస్పీఎస్సీ లీకేజీ, పదో తరగతి పేపర్ల లీకేజీ లాంటి అంశాలను సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.అందెశ్రీ కవిత్వంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల దాడి చేశారు.

ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేదని.. ఈరోజు సామాన్య జనాలు కూడా సీఎంను కలవచ్చని చెప్పుకొచ్చారు. తాము నిరంకుశ్వంతో పరిపాలించాలని అనుకుంటే ఏ బీఆర్ఎస్ నాయకుడ్ని మాట్లాడనిచ్చే వాళ్లం కాదన్నారు.మరోవైపు.. గత పదేళ్లలో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌టీ నివేదికలో వెల్లడైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. తెలంగాణలో వాణిజ్య పంటలకు అవకాశమే లేకుండా.. కేవలం వరి మాత్రమే వేసేలా స్యయంగా అప్పటి సీఎం కేసీఆర్ ప్రేరేపించాలని తెలిపారు. ఆ తర్వాత.. వరి వేస్తే ఉరే అని చెప్పారని తెలిపారు. అలా తెలిపిన కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారని తెలిపారు.

Speaker Gaddam Prasad Kumar strong counter to padi kaushik reddy
Speaker Gaddam Prasad Kumar

సాధారణ రైతులకు 1400 కే కొన్న ప్రభుత్వం.. కేసీఆర్‌ మాత్రం తన వడ్లను క్వింటాల్‌కు రూ.4,250కి అమ్ముకున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారన్నారు. దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి సంసార జీవితానికి పనికిరాకుండా చేశారన్నారు.ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుండటంతో.. వాళ్లను బయటికి పంపించేయండి అంటూ అధికార పక్ష ఎమ్మెల్యేల నుంచి కొందరు సలహా ఇచ్చారు. దానిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ సభ్యుల్లో ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించేది లేదని.. వాళ్లను ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తామని.. వారికి ఇదే శిక్ష అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గౌర‌వ కౌశిక్ రెడ్డి నువ్వు కొత్త‌గా వ‌చ్చిన‌వ్ గ‌డ‌బిక చేయ‌కు కామ్ గా ఉండూ అని స్పీక‌ర్ హెచ్చ‌రించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago