Speaker Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీలో ఎంత రచ్చ జరిగిందో మనం చూశాం. కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా సభ జరిగింది. . గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు వైఫల్యాలను ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి చూపారు. రైతు బీమా, పంట గిట్టుబాటు ధర, సాగు నీటి ప్రాజెక్టులు, టీఎస్పీఎస్సీ లీకేజీ, పదో తరగతి పేపర్ల లీకేజీ లాంటి అంశాలను సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.అందెశ్రీ కవిత్వంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల దాడి చేశారు.
ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేదని.. ఈరోజు సామాన్య జనాలు కూడా సీఎంను కలవచ్చని చెప్పుకొచ్చారు. తాము నిరంకుశ్వంతో పరిపాలించాలని అనుకుంటే ఏ బీఆర్ఎస్ నాయకుడ్ని మాట్లాడనిచ్చే వాళ్లం కాదన్నారు.మరోవైపు.. గత పదేళ్లలో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌టీ నివేదికలో వెల్లడైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. తెలంగాణలో వాణిజ్య పంటలకు అవకాశమే లేకుండా.. కేవలం వరి మాత్రమే వేసేలా స్యయంగా అప్పటి సీఎం కేసీఆర్ ప్రేరేపించాలని తెలిపారు. ఆ తర్వాత.. వరి వేస్తే ఉరే అని చెప్పారని తెలిపారు. అలా తెలిపిన కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారని తెలిపారు.
సాధారణ రైతులకు 1400 కే కొన్న ప్రభుత్వం.. కేసీఆర్ మాత్రం తన వడ్లను క్వింటాల్‌కు రూ.4,250కి అమ్ముకున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారన్నారు. దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి సంసార జీవితానికి పనికిరాకుండా చేశారన్నారు.ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుండటంతో.. వాళ్లను బయటికి పంపించేయండి అంటూ అధికార పక్ష ఎమ్మెల్యేల నుంచి కొందరు సలహా ఇచ్చారు. దానిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ సభ్యుల్లో ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించేది లేదని.. వాళ్లను ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తామని.. వారికి ఇదే శిక్ష అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గౌరవ కౌశిక్ రెడ్డి నువ్వు కొత్తగా వచ్చినవ్ గడబిక చేయకు కామ్ గా ఉండూ అని స్పీకర్ హెచ్చరించారు.