గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం తెచ్చిన వైసీపీ నేతలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని , నూతన మద్యం పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొన్నారు.
వైసీపీ నాయకుల సొంత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వంలో పనికిరాని మద్యం పాలసీ తీసుకువచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానం వలన ఆ పార్టీ నాయకులు లాభపడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.గత వైసీపీ ప్రభుత్వం మధ్యం విధానం వలన పేద ప్రజలు, సామాన్యుల ఆరోగ్యం నాశనం అయ్యిందని, అయినా కూడా పనికిమాలిన కొత్తకొత్త బ్రాండ్ల మద్యం తీసుకు వచ్చి అనేక కుటుంబాలను నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్ర ఆదాయనికి గండిపడేలా మద్యం పాలసీని తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుందని విమర్శించారు. జే బ్రాండ్ పేరిట ప్రజలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ చేసిన అరాచకాలను ఎవ్వరూ మరచిపోలేరు. సీఎం చంద్రబాబు 10రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లారు. విపత్కర పరిస్థితుల్లో ఇంతలా కష్టపడుతున్న మాపై జగన్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.