Sonu Sood : కరోనా సమయంలో ఎంతో మంది సేవలకి అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సోనూసూద్. నిమాల్లో విలన్ వేషాలు వేస్తూ.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. అడిగిన వారికి లేదనుకుండా సాయం చేస్తూ.. ఆపద్బాంధవుడిలా ఆదుకున్నా సోనూ.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చారు. ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి భేదాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా కూడా వెంటనే స్పందించి నిజమైన రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఇప్పటికీ సోనూసూద్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి సంగీత విద్వాంసుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సోనూసూద్ . అతని ఆరోగ్యంపై ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్‌పై స్పందించిన సోనూసూద్.. “ఖాన్ సాహిబ్, మొదట మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తర్వాత మీ సారంగి పాట వింట” అని రీట్వీట్ చేశాడు. వివరాలలోకి వెళితే ఇంద్రజిత్ బార్కే అనే వ్యక్తి హర్యానాకు చెందిన ప్రముఖ సారంగి ప్లేయర్ మమన్ ఖాన్ ఆరోగ్యం బాగోలేదని, అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ట్విట్టర్‌లో తన ఫోటోను షేర్ చేస్తూ తన దయనీయ స్థితిని వివరించాడు. సోనూసూద్ ని ఆ కళాకారుడికి సాయం చేయాలంటూ ట్వీట్ చేయడంతో రీట్వీట్ చేస్తూ బదులిచ్చాడు. “ఖాన్ సాహిబ్, నేను ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ బదులిచ్చాడు. దీంతో సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ రియల్ హీరోని.. సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022 గాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘నేషన్స్ ప్రైడ్’ అనే బిరుదుతో సోనూసూద్ ని సత్కరించిన విషయం తెలిసిందే. ఇక హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన మమన్ ఖాన్ (83)… తన సంగీతంతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.