Sneha Ullal : ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్.ఈ అమ్మడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా లక్కీ సినిమాలో నటించి ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఐశ్వర్య రాయ్ కి పోటీ అన్నట్లుగా సల్మాన్ ఖాన్ ఈమెను ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడని అందరు అనుకున్నారు. అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో తొందరగానే ఫేడవుట్ అయిపోయింది . ఈ మధ్య వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కించుకుంది. స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది.
స్నేహ ఉల్లాల్.. నాని అలా మొదలయింది చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఈ చిత్రం కూడా అమ్మడికి పెద్ద గుర్తింపు తీసుకు రాలేదు. చిన్న చిత్రాలలో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కెరీర్ స్టార్టింగ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. చిన్నగా పరిశ్రమకు దూరం అయ్యింది ఈ భామ.స్నేహ ఉల్లాల్ వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. ఫామ్ లో ఉంటే వయసు పెద్ద సమస్య కాదు. కొన్ని ఆఫర్స్ వస్తూనే ఉండేవి.
తాజాగా గోవా వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడ పొట్టి డ్రస్ లో దిగిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ మత్తెక్కించింది. ఉదయాన్నే బీచ్ లో నో మేకప్, నో సౌండ్ లేకుండా.. హాయిగా డి విటమిన్ దొరుకుతుంది అంటూ రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. అవకాశాల కోసం ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తున్నావా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. ఇంత అందంగా ఉన్నా ఎందుకు అవకాశాలు రావట్లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహ ఉల్లాల్.. ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.