Smitha Sabarwal : ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా తొలిసారిగా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కి స్థాన చలనం అవుతుందా లేదా అనేది అందరిలో సందేహం ఉండేది. కాని ఆమెకి కూడా బదిలీ అయింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 26 మంది ఐఎఎస్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ అధికారులు స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా, అహ్మద్ నదీం, బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, క్రిస్టీనా జెడ్ ఛొంగ్తు, సందీప్ కుమార్ సుల్తానియా, డీ కృష్ణ భాస్కర్, జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎం రఘునందన్ రావు, బీ వెంకటేశంతో పాటు పలువురు అధికారులు బదిలీ అయ్యారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిలీవ్ అయ్యారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీంను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
అయితే స్మిత కొద్ది రోజుల క్రితం సీతక్కని కలిసింది. ఆ రోజు ఆమె ముందు కాలి మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా ఓ ఫొటో వైరల్ అయింది. ఈ ప్రభావంతోనే స్మిత సబర్వాల్ కూడా బదిలీ అయిందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెను తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా రిలీవ్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…