Sita Ramam : దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సీతారామం. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 5న విడుదలైంది. ఇక సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇవే కారణాలు అంటూ ప్రేక్షకులు తమకు నచ్చిన కొన్ని అంశాలను చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా క్లాసిక్ ప్రేమకథలను ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. సీతారామం కూడా అలాంటి ప్రేమ కావ్యమే దాంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు.
అంతే కాకుండా హను రాఘవపూడి సినిమాల్లో సెకండాఫ్ కాస్త బోరింగ్ గా ఉంటుందని ఓ టాక్ ఉంది. కానీ ఈ సినిమాలో సెకండాఫ్ హైలైట్ అవ్వడంతో హనురాఘవపూడి చాలా వర్క్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ల కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయ్యింది. ప్రేమకావ్యాలకు హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు తెగనచ్చేసింది. అంతే కాకుండా ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ సినిమాలో ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అదే విధంగా వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఉండటంతో సినిమా బోర్ కొట్టలేదు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులను దర్శకుడు టెన్షన్ పెట్టాడు. దాంతో క్లైమాక్స్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక టాలీవుడ్ లో చాలా కాలం తరవాత మరో హిట్ సినిమా పడటంతో సినీప్రియులు, దర్శక నిర్మాతలు సైతం ఖుషి అయ్యారు. ఈ మూవీ ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులు చాలా మంది వీక్షించారు.