Silk Smitha : ఒకప్పుడు శృంగార తారగా టాలీవుడ్‌ని ఊపేసిన అందాల ముద్దుగుమ్మ సిల్క్ స్మిత. మలయాళం సినిమాతో వడ్లపట్ల విజయలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్క్రీన్ నేమ్ సిల్క్ స్మిత గా మార్చుకోవటం జరిగింది. అప్పటినుండి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా.. అనేక సినిమాలలో నటించి సెగలు పుట్టించింది. కేవలం సిల్క్ స్మిత పాట కోసం అప్పట్లో సినిమాలు కి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దాదాపు 90లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్గా సిల్క్ స్మిత ఒక రికార్డు ఉంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన.. సిల్క్ స్మిత ఎందుకో ఇంట్లో ఉరివేసుకొని చనిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సిల్క్ స్మిత మృతికి కారణం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. 300కు పైగా సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత.. శృంగార తారగా అప్పట్లో మంచి ముద్ర వేసుకుంది. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటిగా పేరు తెచ్చుకొని అందరి మనసులు గెలుచుకుంది. అప్పట్లో ఆమె కొరికిన యాపిల్ ని వేలం వేస్తే.. వేలంలో 25 వేలుకి వెళ్ళింది. అంటే ఆమె క్రేజ్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సినిమాలు తీయడం.. అక్కడ నష్టాలు చూడడం.. తన మేనేజర్ ని నమ్మి మోసపోవడం.. వంటి సమస్యలతో 35 ఏళ్లకే తన జీవితానికి ముగింపు పలికేసుకుంది. 1996లో సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ సందర్భంలో అనురాధ మాట్లాడుతూ.. స్ట్రెచర్‌పై సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు వాలడం చూసి తనకు ఎక్కడ లేని బాధ,దుఖ: వచ్చాయన్నారు. ఆమె అందానికి,బాడీకి ఎంత క్రేజ్ ఉంది.. అలాంటి బాడీ నిర్జీవంగా మారితే… దానిపై ఈగలు వాలుతుంటే మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింద ఏడ్చేశాను అని అనురాధ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.