Silk Smitha : తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తన అందచందాలతో అలరించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈమె ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈమె అందం చూసి ఐటమ్ సాంగ్‌ల కోసం ఎక్కువగా తీసుకునేవారు. దీంతో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సిల్క్ స్మిత అతి తక్కువ కాలంలోనే తారా స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలలో ఆమె ఉండాలని దర్శకులకు చెప్పేవారు. అంతటి డిమాండ్ ఉన్న సిల్క్ స్మిత కెరీర్ లో కొన్ని కారణాల వల్ల డౌన్ ఫాల్ అయ్యింది.
ఓ సీనియర్ హీరో స్కిల్క్ స్మిత కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సిల్క్ స్మిత డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. చివరికి ఆ డిప్రెషన్ నుండి బయటికి రాలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే అంతకు ముందు సిల్క్ స్మిత ఓ సూసైడ్ నోట్ రాసుకుంది. ఆ నోట్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడా నా 7వ సంవత్సరం నుండి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుంటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా.. అతడు నన్ను మోసం చేశాడు.
దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. నాకు ఒకడు 5 సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. అంటూ సిల్క్ స్మిత ఎంతో ఆవేదనతో లెటర్ రాసింది. అయితే ఆమె జీవితం నాశనం అయ్యేందుకు.. అలా బలవన్మరణానికి పాల్పడేందుకు ఒక ప్రముఖ హీరో కారణమని వార్తలు వచ్చాయి. కానీ అతను ఎవరు అనేది మాత్రం తెలియలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…