Siddu Jonnalagadda: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయా నవేలి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యాక్షన్, ఫామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మంత్ ఆఫ్ మధు. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచిత సాదినేని, మౌర్య సిద్ధవరం, కంచరపాలెం కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిచారు. రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ పెంచారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ గెస్ట్‌గా హాజరు కాగా, ఆ సమయంలో స్వాతి ఏకంగా చరణ్‌కి ముద్దు కూడా పెట్టింది. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ కాగా, వారు చేసిన రచ్చకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మంత్ ఆఫ్ మధు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 1న హైదరాబాద్ ఫిలిం నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గం.ల నుండి గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సిద్ధు మాట్లాడుతూ..శ్రీకాంత్ కథలన్నీ కూడా యూనివర్సల్‌గా ఉంటాయి. భవిష్యత్ ని ఊహించి రాస్తాడు. సినిమాల విషయంలో కొన్ని లెక్కలు ఉంటాయి.దీని తర్వాత ఇది జరగబోతుందని, దీని తర్వాత ఇది అవుతుందని కొంత గెస్ చేయగలం. కాని ఈ సినిమాలో అలా కనిపించడం లేదు.
ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాకుండా ప్రతి పాత్ర పరిపూర్ణంగా ఉంటుందని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. మంత్ ఆఫ్ మధు ట్రైలర్ బాగా నచ్చింది. ఇక స్వాతి గురించి సరదాగా మాట్లాడుతూ.. పన్ను మీద పన్ను ఉందని అప్పట్లో నన్ను కూడా స్వాతితో పోల్చారు. అప్పుడు మేము ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటాం. రెండు ఫార్మసూటికల్ ఎండీస్ మాట్లాడుకుంటున్నట్టు మేం మాట్లాడుకునే వాళ్లం అంటూ స్వాతితో సరదాగా కామెడీ చేశారు సిద్ధు. ఇక నవీన్ చంద్ర కూడా సినిమాలో అద్భుతంగా నటించాడు అని చెప్పుకొచ్చాడు ఈ యువ హీరో.