Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం చిత్రంలో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన నటి శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో శ్వేతా నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసే సమయానికి శ్వేతా వయస్సు 17 ఏళ్లు అయిన చాలా మెచ్యూర్డ్‌గా నటించింది. కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్వేతా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. ఇక మధ్యలో వ్యభిచార రాకెట్‌లో పట్టుబడడం, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు చేయడం, అనంతరం దర్శకుడు రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
బ్రేకప్ తర్వాత స్పందించిన శ్వేతా బసు.. తమ బంధం కేవలం 8 నెలల్లోనే ముగిసిపోతుందని కలలో కూడా అనుకోలేదని.. కానీ ఊహించనిదే జీవితం అంటుంది శ్వేతా బసు ప్రసాద్. దూరంగా ఉన్నా.. విడిపోయినా కూడా కచ్చితంగా మళ్లీ ఆయన దర్శకత్వంలో కలిసి పని చేస్తామనే నమ్మకం ఉందని కూడా అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే శ్వేతాబసు కొత్త బంగారు లోకం సినిమా సమయంలో చాలా బొద్దుగా ఉండగా, ఇప్పుడు మాత్రం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు కూడా శ్వేతా చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
శ్వేత మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ క్రిమినల్ జస్టిస్ సీజన్-3లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రను పోషిస్తోంది. పంకజ్ త్రిపాఠి రోల్ మాధవ్ మిశ్రాతో పోటీ పడింది. బాల నటిగా పలు సినిమాలు చేసిన శ్వేతా బసు మక్డీలో తన పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.