శృతి హాస‌న్‌పై భారీ ఎత్తున ట్రోలింగ్‌.. అస‌లు కార‌ణం ఏంటి..?

ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతున్నాయి. కొన్ని నెలల నుంచి బాలీవుడ్‌ను వేధిస్తున్న సోషల్ మీడియా ట్రెండ్ ఇది. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి హిందీలో పెద్ద పెద్ద సినిమాలను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేస్తుండడం.. విపరీతమైన నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తుండడం తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా లాంటి సినిమాలు థియేటర్లలోకి రాకముందే కిల్ అయిపోవడానికి ఈ బాయ్‌కాట్ బ్యాచ్ నెగెటివిటీనే కారణం.

ఇంకొన్ని మూవీస్ కూడా వీరి ధాటికి బలయ్యాయి. తాజాగా దీనిపై స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్పందించింది. సినిమాలను బ్యాన్ చేయాలనే కల్చర్.. ఒక రకంగా బెదిరింపులకు పాల్పడడమే. ఇలాంటిది సినీ రంగానికే పరిమితం కాదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీని వెనుక చాలా కోణాలు ఉన్నాయి. ప్రస్తుత ఈ ఆన్ లైన్ హేట్ సమాజంలో ద్వేషాన్ని నింపేలా ఉంది. నేను కూడా పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా ఈ హేట్ ను ఎదుర్కొన్నా. నన్ను సోషల్ మీడియాలో చాలా మాటలన్నారు. చుడైల్ (మంత్రగత్తె అని అర్థం) అని కూడా పిలిచేవాళ్లు.

shruti haasan being trolled by netizen for this reason know it

ఏం జరిగినా పాజిటివ్‌గానే ఉండాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఏ రంగంలో అయినా సరే.. నెగెటివిటీ, హేట్ అనేవి మంచిది కాదు అని శ్రుతి హాసన్ అభిప్రాయపడింది. లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్‌, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్నా గతేడాది జనవరిలో మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago