Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. వివాహం అయ్యి ఒక పాపకు కూడా జన్మనిచ్చాక శ్రియ శరణ్ ఇప్పుడు ఇంకా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి బియ్యాల పాపారావు దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రమోషన్స్ లో శ్రియ శరణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. 22 సంవత్సరాల నుంచి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం ఆమెకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు సైతం ఆమె బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్ చిత్రం బై లింగ్వల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు . ఈనెల 12న మూవీ తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శ్రియ ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రం. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అని చెప్పిన శ్రియ అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అని అన్నారు.
భవిష్యత్తులో ఈ సినిమాను తన కూతురు రాధ చూస్తే గర్వంగా ఫీలవుతుందని అన్నారు. పిల్లల మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్ తో తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారన్నారని, తాను ఓ మంచి తల్లిదండ్రులను కలిగి ఉన్నానని, అందుకే తాను ఏది చేయాలనుకుంటే అది చేశానని ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇంటి నుండి బయటకు రావాలంటే కొందరు పోరాటాలు చేస్తున్నారని వాపోయింది. చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానని పేర్కొంది శ్రియ. రీసెంట్‌గ హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగగా, ఆ కార్యక్రమంలో క్యూట్ డ్రెస్ లో మెరిసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…