Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ కూడా ఒకరు. ఆయన ఇప్పుడు తన బ్యాచ్లర్లైఫ్కు గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ ఏడాది జనవరిలో రక్షితారెడ్డితో శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా తన పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందా అని అందరు ముచ్చటించుకున్నారు. జూన్ 3న శర్వానంద్, రక్షితా రెడ్డి పెళ్లిపీటలెక్కబోతున్నారు. రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ను వీరి పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. అయితే జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు రూ. 4 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. అందుకే వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, బంధువులు మాత్రమే హజరుకానున్నారు. శర్వానంద్ కొత్త సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండటంతోనే పెళ్లి తేదీని ఆలస్యంగా అనౌన్స్ చేసినట్లు సమాచారం. జూన్ 3లోపు ప్రజెంట్ మూవీ కమిట్మెంట్స్ అన్ని పూర్తిచేసే పనిలో శర్వానంద్ ఉన్నట్లు చెబుతోన్నారు.
శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితంలో సినిమాలో కనిపించారు. అంతకు ముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్లే శర్వానంద్ పెళ్లి ఆలస్యమైనట్లుగాసమాచారం.ఇక ఇదిలా ఉంటే.. శర్వానంద్ కు కాబోయే భార్య రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత. ఈ జంట చాలా చూడ ముచ్చటగా ఉంది. వీరిద్దరు నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లా పాపలతో కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.