Shamar Joseph : గబ్బాలో ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. కరేబియన్ జట్టు ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు మ్యాచ్ గెలవడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం జరిగింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పేసర్ షమర్ జోసెఫ్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత విండీస్ సాధించిన తొలి విజయం ఇది. అందుకే ఈ గెలుపునకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ విజయంలో కీలక భూమిక పోషించిన ఆటగాడు షామార్ జోసెఫ్. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు తీసిన షామార్ జోసెఫ్ ఆసీస్ వెన్నువిరిచాడు. షామార్ జోసెఫ్… వెస్టిండీస్ జట్టులో ఇంతకు ముందెప్పుడూ వినని పేరు ఇది. ఎందుకంటే, షామార్ కు కెరీర్ లో ఇది రెండో టెస్టు మాత్రమే. ఈ సిరీస్ తోనే అంతర్జాతీయ క్రికెట్ గడప తొక్కిన ఈ 24 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ కు భవిష్యత్ పై ఆశలు కల్పిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ షామార్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. షామార్ నిప్పులు చెరిగే పేసర్ మాత్రమే కాదు, ఆఖర్లో ఎంతో ఉపయుక్తమైన బ్యాట్స్ మన్ కూడా. అడిలైడ్ టెస్టులో 11వ వాడిగా దిగి 41 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు.
అసామాన్య ప్రదర్శనతో వెస్టిండీస్‌ను గెలిపించిన షమర్ జోసెఫ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదలి క్రికెటర్‌గా మారిన షమర్.. తొలి సిరీస్‌లోనే వెస్టిండీస్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడం విశేషం. తను ఊహ తెలిసినప్పటి నుంచి విండీస్ దిగ్గజ ఆటగాళ్లు అయిన ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ లను ఆరాధిస్తూ పెరిగాడు. తన గ్రామంలో టేప్ బాల్, నిమ్మకాయాలు, జామ పండ్లతో బౌలింగ్ చేయడం ప్రాక్టీస్ చేసేవాడు. మ్ స్టర్ డామ్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధుల్లోకి చేరాడు. దీంతో తన డ్రీమ్ అయిన క్రికెట్ కు సమయం కేటాయించలేకపోయాడు. కానీ సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెటర్ రొమారియో షెపర్డ్ ద్వారా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అతడే జోసెఫ్ ను గయానా క్రికెట్ జట్టుకు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…