Shaakuntalam : ఓ పక్క గ్లామర్ చిత్రాలతో, మరోవైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తూ దూసుకెళ్తోంది సమంత. తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన విమర్శలని మూటగట్టుకుంటుంది.. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీని నీలిమా గుణ నిర్మించగా, తొలి రోజు ఈ చిత్రానికి ఓ మోస్తారు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. లాంగ్ రన్‌లో కూడా ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టడం కష్టమేనని తెలుస్తుంది.
ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం శాకుంతలం మూవీ డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు టాక్.. మంచి ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుండగా, శాకుంతలం విడుదలైన 4 నుంచి 6 వారాల మధ్య సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. అయితే మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో అంతకంటే ముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మే మొదటి వారంలో శాకుంతలం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారం ఈ మూవీని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు. భరతుడిగా అల్లు అర్హ తొలి చిత్రంతోనే మెప్పించింది. ఇక వీరితో పాటు మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2015 పీరియాడికల్ డ్రామా ‘రుద్రమదేవి’ తర్వాత.. 7 సంవత్సరాల గ్యాప్ తీసుకొని గుణశేఖర్ తీసుకొని గుణశేఖర్ ఈ చిత్రం తెరకెక్కించగా, మూవీ దారుణమైన విమర్శలని అందుకుంటుంది.