Shaakuntalam : మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు. భరతుడిగా అల్లు అర్హ నటించింది. వీరితో పాటు మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈ చిన్నారి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా అర్హ పాత్రని కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమా కోసం సమంత ఎంతో శ్రమించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నట్టు కూడా చెప్పుకొచ్చింది.
సమంత చిత్ర ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను పూలను నా చేతులకు, మెడకు వేసుకునేదాన్ని.. సాయంత్రం వాటిని తీసేసిన తర్వాత నా చేతులకు పూల అచ్చు ఏర్పడింది. ఆ అచ్చు దాదాపు ఆరు నెలల పాటు ఉండింది. అయితే అదృష్టం కొద్ది ఆ మచ్చ పోయింది. ఇక షూటింగ్‌లో నన్ను ఓ కుందేలు కరిచింది. నా పాత్ర కోసోం దాదాపు 30 కేజీలు బరువున్న లెహంగాలు ధరించాను. వాటిని వేసుకొని డ్యాన్స్ చేసినప్పుడు చాల ఇబ్బందిగా అనిపించేది. ఆ సమయంలో ఒక్కోసారి 10, 15 టేకులు తీసుకునేదాన్ని. ఈ సినిమా కోసం మొత్తం మూడు భాషల్లో నేనే స్వయంగా డబ్బింగ్ చేసుకున్నాను. అది చాలా కష్టంగా అనిపించింది అని సమంత తన బాధలు చెప్పుకొచ్చింది.
సినిమా కోసం తన ఎఫర్ట్ అంతా పెట్టి పని చేసిన సమంతకి ఈ మూవీ తీవ్ర నిరాశని కలిగించింది. మయోసైటిస్‌తో బాధపడుతూనే కొన్ని రోజులు ఈ షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత వెంటనే ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంది. సినిమా కోసం సమంత ఎన్నో కష్టాలు పడింది. అయితే శాకుంతలం రిజల్ట్ చూశాక దర్శకుడి కష్టంతో పాటు సమంత కష్టం కూడా వృధా అయింది అంటున్నారు. ఈ సినిమా సమంతకి మంచి పేరు తెస్తుందని అందరు అనుకున్నారు కాని దారుణమైన ఫలితం ఇచ్చింది.