Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద తర్వాత తెలుగు ప్రేక్షకులని శాకుంతలం చిత్రంతో పలకరించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కీలక పాత్ర చేశాడు. ఈ మైథలాజికల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, తన ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను సైలెంట్‌గా విడుదల చేసింది ప్రైమ్. నిజానికి ఈ సినిమాను ఈ నెల 12న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఒక రోజు ముందుగానే రిలీజ్ చేసి షాకిచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం అవుతుంది.
“యశోద” చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సామ్ ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంది. కానీ ఫైనల్ గా ఈ సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది. భారీ తారాగణంతోనే చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్ బాబు, అల్లు అర్హా, సచిన్ ఖేడేకర్, జిషు సేన్‌గుప్తా, మధు, అదితి బాలన్, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ దుహన్ సింగ్ వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ- దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.
‘శాకుంతలం’ని రూ.80 కోట్లు పెట్టి తీస్తే.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. దీంతో సినిమా భారీ నష్టాలని చవి చూసింది. కాళిదాసు రచన ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒక సవాలుగా తీసుకొని గుణశేఖర్ డైెరెక్ట్ చేశాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాని చూసిన ఆడియన్స్ గుణశేఖర్‌ను సోషల్ మీడియాలో ఏకిపారేశారు. మన కల్చర్, మైథలాజికల్ చిత్రాలకు ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో మంచి ఆదరణ వస్తుండడంతో చిత్రం గట్టిగా లాభాలు అందుకుంటుందని అందరు అనుకున్నారు కాని బెడిసి కొట్టింది.