Seethakka : అసెంబ్లీలో సీత‌క్క మాస్ స్పీచ్.. అంద‌రూ షాక‌య్యారుగా..!

Seethakka : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఆయ‌న ఎన్నికైన విష‌యం తెలిసిందే. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్‌గా నియామకమైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్‌తో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. సీత‌క్క అసెంబ్లీలో గ‌డ్డం ప్ర‌సాద్ ఎలాంటి ప‌రిస్థితి నుండి ఈ స్థాయికి వ‌చ్చాడ‌ని తెలియ‌జేశారు. అణ‌గారిన వ‌ర్గాల నుండి ఈ స్థాయికి చేరుకున్న ఆయ‌న ఎంద‌రికో ఆద‌ర్శం అని సీత‌క్క అన్నారు. ఇక కేటీఆర్ కూడా ఆయ‌న‌ని స్పీక‌ర్‌గా ఎంపిక చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ అంద‌రి ప‌క్షాన ఉండి స‌భ‌ని విజ‌య‌వంతంగా న‌డిపిస్తార‌ని ఆశిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే సీత‌క్క అప్పుడే ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు వ‌దులుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిప‌డ్డారు.

Seethakka speech in assembly everybody surprised
Seethakka

బీఆర్ఎస్ నాయకులకు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీ అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోష పడుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే సీతక్క సొంతూరికి ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టబోతోంది. ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. మంత్రి గ్రామానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవటం.. అక్కడి నుంచి ప్రయాణం చేసేవాళ్లు కూడా పెద్దగా ఉండరు అన్న కారణంగా.. ఇన్నాళ్లు బస్సు నడపలేదు. వేరే ఊర్లకు వెళ్లాలంటే.. సొంత వాహనాలు లేదంటే ఆటోలే దిక్కు. అయితే.. ఓ మంత్రి స్వగ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవటమనేది.. రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు.. ఆ మార్గంలో సర్వే చేశారు. త్వరలోనే ఈ రూట్‌లో బస్సు నడిపించనున్నట్టు వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago