Seethakka : సీతక్క క్రేజ్ చూసి షాకైన సోనియా.. గ‌వ‌ర్న‌ర్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం..

Seethakka : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేసారు.. ఆయనతో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైక‌మండ్ పెద్ద‌ల స‌మ‌క్షంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది. ప్రమాణస్వీకారానికి సీతక్కని పిలిచిన వెంటనే ఆమె వేదికపైకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో హోరెత్తారు.

ఎల్బీ స్టేడియం ప్రాంగణమంతా మోత మోగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన అభిమానులకు అభివాదం చేసిన సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెబితే సీతక్క మాత్రం దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు. తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, తెలంగాణా రాష్ట్ర మంత్రిగా, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్త శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను” అంటూ ప్రమాణం చేశారు.

Seethakka fan following everybody surprised
Seethakka

సీతక్క ప్రమాణస్వీకారం అనంతరం కూడా స్టేడియంలో జయ జయ ధ్వానాలు మారుమోగాయి. అనంతరం సీతక్క ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హత్తుకుని, నవ్వుతూ ఆమె భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. సీతక్క మాత్రమే కాదు కొండా సురేఖను సైతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆలింగనం చేసుకోవడంతో కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తాను ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలినేనని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తెలంగాణ ప్రజలు తనపై మరింత పెద్ద బాధ్యతను పెట్టారని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago