Seetha In Movies : సినిమా రంగంలో హీరోలతో పాటు దర్శకనిర్మాతలకు సైతం కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రతి సినిమాకి ఏదో ఒక సెంటిమెంట్ అయితే వారు తప్పక పాటిస్తారు. అయితే కొన్ని పేర్లకు తెలియకుండానే ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతుంటారు. అలా కనెక్టే అయ్యే పేరు సీత . ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాలోనూ హీరోయిన్ పాత్ర సీత పేరుకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపొయారు. అయితే సీత పేరుతో తీసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సీతారామం.. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఇందులో దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్ నటించగా, హీరోయిన్ పాత్ర పేరు సీత అని ఉండడంతో చాలా మంది ప్రేక్షకుల ఈజీగా కనెక్ట్ అయ్యారు.
2013 లో విడుదలై మంచి హిట్ సొంతం చేసుకున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.ఇందులో వెంకటేష్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించగా, అంజలి పాత్ర పేరు సీత అని ఉండగా తను ఆ పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించింది. 2015 లో హరీష్ శంకర్ దర్శకత్వం విడుదలైన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇందులో సాయి ధరమ్ తేజ్, రెజీనా, హీరోహీరోయిన్స్‌గా నటించగా, ఇందులో రెజినా పాత్ర పేరు సీత.పాత్రకు తగ్గట్టుగా రెజీనా అద్భుతంగా నటించింది. 2016లో కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్నినాయన. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర పేరు కూడా సీతనే.
జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా కంచె.ఇందులో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటీనటులుగా నటించారు.ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ పాత్ర పేరు సీత. ఈ సినిమా మాత్రం బాగా ఆకట్టుకుంది. 2006 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా గోదావరి.ఇందులో సుమంత్, కమలిని ముఖర్జీ నటీనటులుగా నటించగా, ఇందులో హీరోయిన్ పాత్ర పేరు కూడా సీతనే.అలా సీత అనే పేరుతో ఉన్న ఈ సినిమాలు అన్ని మంచి సక్సెస్ కూడా అందుకున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…