Sania Mirza : భారత్ – పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం.. సరిహద్దుల్లో నిత్యం కల్లోలాలు.. ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ, కబడ్డీతో పాటు ఏ క్రీడ అయినా అదొక టగ్ ఆఫ్ వార్‌గా నడుస్తుంది. అయితే ఇంత క్లిష్టమైన సమయంలో సానియా మీర్జా – షోయబ్ మాలిక్‌లు వివాహబంధంతో కలవడం అనేది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. ప్రేమకు సరిహద్దులతో సంబంధం లేదని, మనసులు కలిస్తే మనుషులను గెలవడం అంత కష్టమేమీ కాదని నమ్మిన ఆ జంట.. పుష్కరకాలం కూడా కలిసుండలేకపోయింది. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికీ మాలిక్‌కు రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ మారాయి.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రెండేళ్ల క్రితమే వార్తలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌తో మరోసారి విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి’ అంటూ సానియా ఓ కొటేషన్‌ను తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనం రేపింది. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అఫీషియల్ గా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొత్త జంట ఫొటోలు చూసి సానియా, షోయబ్ విడాకులు తీసుకున్న సంగతి నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సానియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుు చూసి చాలామంది వారు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు.ఇక సనా విషయానికి వస్తే ఆమె వయస్సు 28 ఏళ్లు. అనేక టీవీ షోల్లో కనిపించింది. ‘ఏ ముష్త్-ఎ-ఖాన్’, ‘డంక్’ అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే 2020లో ఉమైర్ జస్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…