Samyuktha Menon : కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె బింబిసారలోను నటించి తన నటనతో అదరగొట్టింది. ఇక లేటెస్ట్‌గా విరూపాక్షతో మరో హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది సంయుక్త మీనన్. ఈ అమ్మడు ప్రధానంగా మలయాళం, తెలుగు మరియు తమిళ చిత్రాలలో పనిచేసింది. సెప్టెంబర్ 11, 1995న జన్మించింది సంయుక్త.
సంయుక్త భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించింది. ఆమె తన విద్య కోసం తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో చదివింది మరియు ఆమె ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసింది. మొత్తంగా ఆమె 20కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ చిత్రం.. ఒరు యమందన్ ప్రేమకధ (2019) 1.85 కోట్లు సుమారుగా రాబట్టింది. సంయుక్త నటించిన చిత్రాలలో మొదటి వారం అత్యధిక వసూళ్లు ఒరు యమందన్ ప్రేమకధ (2019) 10 కోట్లు రాబట్టింది.
ఇక ఆమె నటించిన చిత్రాల విషయానికి వస్తే.. పాప్ కార్న్ (2016) అనే మలయాళం చిత్రం ఫ్లాప్ గా మారింది. తీవండి(2018) సూపర్ హిట్ అయింది. ఇక లిల్లీ( 2018 ) హిట్‌గా నిలిచింది. కలరి యావరేజ్ గా, జూలై కాట్రిల్(2019) హిట్ గా, ఒరు యమందన్ ప్రేమకధ( 2019) యావరేజ్‌గా, ఉయారే (2019)సూపర్ హిట్ గా, కల్కి( 2019) యావరేజ్ గా, ఎడక్కాడ్ బెటాలియన్ ఫ్లాప్, అండర్ వరల్డ్ యావరేజ్, వెళ్లం సూపర్ హిట్, ఆనుమ్ పెన్నుమ్ హిట్, తోడేలు ఫ్లాప్, ఎరిడా హిట్, భీమ్లా నాయక్ సూపర్ హిట్, గాలిపాట సూపర్ హిట్, కడువా హిట్, బింబిసార బ్లాక్ బస్టర్, సార్ బ్లాక్ బస్టర్, బూమరాంగ్ యావరేజ్, విరూపాక్ష సూపర్ హిట్. ఇలా మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించింది సంయుక్త.