Samantha Temple : తమిళ బ్యూటీ అయిన సమంత తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. తెలుగమ్మాయిగా మారింది. ఈ అమ్మడికి రెండు తెలుగు రాష్ట్రాలలో వీరాభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫుల్ బిజీగా మారింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల మయోసైటిస్ బారిన పడడం వలన కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన సమంత ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. త్వరలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. అయితే సమంతకు ఇటీవల ఓ వీరాభిమాని ఏకంగా గుడికట్టించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే యువకుడు సమంతకి వీరాభిమాని కాగా, ఏకంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఆమె కోసం గుడి కట్టాడు. ఆమె అనారోగ్యం బారిన పడినప్పుడు పలు ఆలయాలలో మొక్కులు చెల్లించుకున్నాడు. ఎన్జీవోలు పెట్టి చాలా మందికి సాయం చేయడంతో పాటు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంత అంటే అభిమానంతోనే తాను గుడి కట్టినట్లు సందీప్ చెప్పారు. సమంతకు సందీప్ గుడి కట్టడంపై ఆయన భార్య స్పందించారు. తాను ఎంతగానో ఆరాధించే, ఇష్టపడే నటికి సందీప్ ఆలయం నిర్మించడంపై ఆయన భార్య హర్షం వ్యక్తం చేశారు.
చాన్నాళ్లుగా తాము గుడి కట్టాలని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు కుదిరిందన్నారు. రోజూ ఒక్కసారైనా సమంత టాపిక్ తమ ఇంట్లో వస్తుందని.. పెళ్లైన కొత్తలోనే ఆమెకు తాను అభిమానినని సందీప్ చెప్పారని ఆమె పేర్కొంది. ఏదేమైన భర్తకు సపోర్ట్‌గా ఇలా భార్య నిలవడంతో సమంత అభిమానులు ఆమెపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టిన సమంత.. ప్రస్తుతం దూకుడుగా మూవీస్ చేస్తోంది. డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. టాలీవుడ్ స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ అమ్మడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది.