Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సంబంధించి ఎన్ని వార్తలు వస్తున్నాయో లెక్కేలేదు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవరికి తెలియరావడం లేదు. అయితే ఈ అమ్మడు కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. తనపై ఎలాంటి రూమర్ వచ్చిన స్పందించడం లేదు. దీంతో కోకొల్లులుగా వార్తలు వస్తున్నాయి. సమంత సద్గురు సూచన ప్రకారం రెండో పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త హల్చల్ చేయగా, ఆమె అనారోగ్యానికి గురైందని ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. సమంత అమెరికాకు పయనం అవుతున్నట్టు తెలుస్తోంది. సమంత స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సమంత చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాకి సైతం దూరంగా ఉంటూ వస్తుందని అంటున్నారు. అసలు ఈ వార్తలో ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.
రెండు నెలల పాటు సమంత షూటింగ్స్‌కి దూరంగా ఉండనుండగా, ఖుషీ సినిమా పరిస్థితి ఏంటనేది అర్ధం కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. సమంత కాంబినేషన్‌లో చాలా సీన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మరి అవి ఎప్పుడు పూర్తి చేస్తుందో, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా సమంత బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తోపాటు హాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.