Samantha : అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి తనపేరు చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. ఇక నాగేశ్వరరావు తనయుడు నాగార్జున కూడా విభిన్న పాత్రలు చేశాడు. రొమాంటిక్, యాక్షన్, భక్తిరసం ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాడు. అయితే ఒకప్పుడు నాగార్జున హవా బాగానే నడిచిన ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. కొన్నాళ్లుగా ఆయన సక్సెస్ అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఆఫీసర్ సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న నాగార్జున గత ఏడాది వైల్డ్ డాగ్ తో, ఈ ఏడాది ది ఘోస్ట్ తో తన ఖాతాలో అట్లర్ ఫ్లాప్ సినిమాలు వేసుకున్నాడు.
ఇక తండ్రి నాగార్జున పరిస్థితి ఇలా ఉంటే తనయులు నాగ చైతన్య, అఖిల్ సిట్యుయేషన్ కూడా అలానే ఉంది. వారు సినిమలు చేస్తున్నా కూడా మంచి హిట్ అనేది పడడం లేదు. చైతూ చివరి సినిమా ‘థాంక్యూ’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దానికి కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక అఖిల్ మూడు వరుస డిజాస్టర్ల తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పర్వాలేదనిపించుకునే సక్సెస్ అందుకున్నప్పటికీ, ఈ సక్సెస్ తన ఖాతాలో పడలేదు. త్వరలో ఏజెంట్ చిత్రంతో అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే అక్కినేని ఫ్యామిలీ హిట్ కోసం పరితపిస్తుంటే ఆ ఇంటి మాజీ కోడలు మాత్రం రోజుకోజుకి తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 భారీ హిట్ కావడంతో సమంతకి మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా యశోద చిత్రం కూడా సమంత ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది. యశోద సినిమాకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి రోజు దాదాపు మూడు లక్షల గ్రాస్ వచ్చింది. దసరా టైంలో రిలీజైన నాగ్ భారీ సినిమా ‘ది ఘోస్ట్’ తొలి రోజు ఇదే సెంటర్లో 2.35 లక్షలు మాత్రమే రాబట్టింది. అంటే తన మాజీ మామ సినిమా వసూళ్లని దాటి ఈ సినిమా దూసుకుపోతుంది. మరో వైపు చైతూ సినిమా అయితే ఈ సినిమాతో పోల్చుకునేలా కూడా లేదు. మొత్తానికి సమంత బయటకు వెళ్లిన అక్కినేని వారిపై గట్టిగానే రివెంజ్ తీర్చుకుంటుందనే టాక్ వినిపిస్తుంది.