Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది. మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా యశోద చిత్రంతో పలకరించింది . ఆ తర్వాత శాకుంతలం చేసింది. శాకుంతలం చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. అంతకు ముందు నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన కథువక్కు రెండు కాదల్ సినిమా కూడా హిట్ కాలేదు. అయినా కూడా డిమాండ్ తగ్గలేదు. సినిమాకి సినిమాకి రెమ్యునరేషన్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే సామ్ కూడా ఆస్తుల మీద ఆస్తులు కొంటోంది.
తాజాగా సమంత విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది.విడాకులకు ముందు సమంతా, నాగ చైతన్య ఒకే ఇంట్లో కలిసి జీవించారు. విడాకుల తర్వాత ఆ ఇంటినే కొనుగోలు చేసి అక్కడే నివసించింది. తాజాగా హైదరాబాద్‌లోని ఓ రిచ్ ఏరియాలో లగ్జరీ ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇంటికోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా, సుమారు రూ.7.8 కోట్లు పెట్టి ఈ డూప్లెస్ హౌస్ తీసుకుందని ఇది 13, 14 అంతస్థులలో ఉందని, ఇది సుమారు 7,944 చదరపు అడుగులు ఉందని ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలాటియల్ హౌస్‌లో సమంత నివాసం ఉంటోంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పుడు ఒక ప్రముఖ నటుడి నుండి ఈ ఇంటిని కొనుగోలు చేయగా, విడాకుల తర్వాత, ఇల్లు అమ్మేసారు. అప్పుడు మళ్లీ సమంతా భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేసి అక్కడే నివసిస్తుంది. సమంతా మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా. ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకుంటున్న ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనతో కూడా భారీగానే సంపాదిస్తుంది. ఈ అమ్మడికి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ 7తో సహా కొన్ని లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…