Samantha : సమంత.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఇటీవల విడాకులు, మయోసైటిస్ వంటి విషయాలతో తెగ వార్తలలో నిలుస్తుంది. మయోసైటిస్ వలన ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకున్న ఈ భామ కొద్ది రోజుల పాటు షూటింగ్స్ కి హాజరు కాను అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే .అన్నట్లుగానే విదేశాలకు చెక్కర్లు కొడుతూ పూర్తి విశ్రాంతి మూడ్ లో సమంత ఉన్న విషయం ను ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను మరియు సన్నిహితుల ఫోటోలను తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
ఇటీవలే సామ్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ వెంటనే తిరిగి వెళ్లిపోయినట్లు టాక్ వినిపించింది. అయితే ఉన్నట్లుండి సామ్ ముంబయిలోని ఓ ప్రముఖ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో సామ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తూ థ్రిల్ చేస్తుంది. స్లీవ్ లెస్ గ్రే బాడీకాన్ క్రాప్ టాప్ తోపాటు.. డెనిమ్ జీన్స్ ధరించి సరికొత్త ఫ్యాషన్ ఐకానిక్ గా కనిపించింది. సామ్ సరికొత్త లుక్ చూస్తుంటే… ఈ అమ్మడు హాలీవుడ్ హీరోయిన్ మాదిరిగా ఉందంటూ కొందరు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.గత కొద్ది రోజులుగా సమంత సినిమా అప్డేట్స్ కాకుండా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఆమె కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది అంటూ సమాచారం అందుతుంది.ప్రముఖ దర్శకుడు ఇప్పటికే ఆమెతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఓకే చెప్పించాడని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఆ సినిమా నిర్మాణానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వారు సమంతకి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారు అంటూ కూడా సమాచారం అందుతుంది.మొత్తానికి సమంత బ్రేక్ తీసుకున్న తర్వాత కొత్త సినిమా వెంటనే చేయబోతుందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ దర్శకుడు ఎవరు ఆ నిర్మాణ సంస్థ ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని వారాల వరకు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమంత ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లుగా దర్శకుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు ఓ టాక్ వినిపిస్తుంది.