Samantha : ఎంతో చలాకీగా ఉండే సమంత ఇటీవల తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని ప్రకటించడంతో ఆమె గురించి నిత్యం వందల కొద్ది వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇటీవల కొందరు అయితే సమంత పరిస్థితి క్రిటికల్‌గా ఉందని కూడా అన్నారు. దానిపై ఇటీవల యశోద ప్రమోషన్స్ లో స్పందిస్తూ నేను ఇంకా చనిపోలేదు. బ్రతికే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా సమంత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాని ప్రచారం జరిగింది. ఈ వార్తలు చూడగానే.. సమంత అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆమె మేనేజర్.. అలాంటిదేమీ లేదని తెలపడంతో.. హమ్మయ్యా అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. వినిపిస్తున్న వార్తలు నిజం కాదు. దయచేసి ఎవరూ కంగారు పడకండి’’ అంటూ సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సమంతకు బాగాలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలని చూసి.. ‘ఆమె త్వరగా కోలుకోవాలి’ అంటూ అభిమానులతో పాటు.. కొందరు సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేయడంతో ప్రస్తుతం సమంత పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదిలా ఉంటే సమంత కొద్ది రోజుల మందే అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్టు అక్టోబర్ చివరి వారంలో సమంత వెల్లడించింది. `యశోద` విడుదలకు ముందు ఈ విషయాన్ని చెప్పి కాస్త సింపథి కూడా కొట్టేసింది. ఈ క్రమంలో యశోద చిత్రం మంచి విజయం కూడా దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో ఆసుపత్రిని కించపరిచినట్టు కోర్ట్‌లో పిటీషన్ వేయడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు తదుపరి విచారణ జరుపనున్నట్టు తెలిపింది. సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కి `ఈవా`అనే పేరు పెట్టి, అందులో అక్రమాలు జరుగుతున్నట్టుగా సినిమాలో చూపించారు.దీంతో వారు తమ ప్రతిష్ట దెబ్బ తిన్నట్టుగా ఫీలై కోర్ట్‌లో పిటీషన్ వేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…