Sajjala Ramakrishna Reddy : స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు అని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబుల అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు చేసిన నేరానికి తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు గత రెండేళ్లుగా ఈ కేసులపై కూడా విచారణ జరుగుతోందని తెలిపారు.రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు అండ్ కో చాలా బెనిఫిట్ పొందారని ఆరోపించారు.కక్ష సాధించి అరెస్ట్ చేయడం వలన తమకేంటి ఉపయోగమని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ కేసుల్లో లోకేశ్ కూడా ఉన్నారన్న సజ్జల అన్ని చోట్లా ఆయన పేరు వస్తుందన్నారు.ఫైబర్ నెట్ లో లోకేశ్ కచ్చితంగా దొరుకుతారని చెప్పారు.
పీవీ రమేశ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ బూతు పురాణం ప్రజలంతా విన్నారని రామకృష్ణా రెడ్డి దుయ్యబట్టారు. చేసిన నేరాలకు తలదించుకోవాల్సిందిపోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. హెలికాఫ్టర్‌లో వస్తే గంటలో విజయవాడ వచ్చే వారని సాయంత్రానికి ప్రక్రియ ముగిసేదని సజ్జల చెప్పారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ సజ్జల ఆరోపించారు. అరెస్ట్ చేస్తే ఒక డ్రామా చేయలేదు అంటే ఇంకో డ్రామా అని సజ్జల ధ్వజమెత్తారు. ప్రతీ విషయంలో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం అని తెలియజేసిన సజ్జల.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చిన్నది మాత్రమేనని ఇంకా చాలా కేసులు వున్నాయని సజ్జల అన్నారు. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ భూములు, రింగ్ రోడ్డు, సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో అవినీతి వంటి కేసుల్లో ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. చంద్రబాబు మాకు అసలు రాజకీయ ప్రత్యర్థే కాదు. అసలు వీరందరిని అరెస్ట్ చేసి మేం ఏం చేసుకోవలి అంటూ సజ్జల స్పష్టం చేశారు.