Sai Pallavi Sister : ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి చెల్లెలు.. ముద్దుల‌తో ముంచెత్తారుగా..!

Sai Pallavi Sister : దక్షిణాది సినీ పరిశ్రమలో లేడి సూప‌ర్ స్టార్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అంతకుమించిన అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ త‌న అందంతో, అభిన‌యంతో పాటు డ్యాన్స్‌తోను తెగ రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సాయి పల్లవి ఎక్కువ యాక్టివ్‌గా ఉండదన్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి అప్పుడప్పుడు వేసే పోస్టులు, షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి. సాయి పల్లవి తన చెల్లి పూజా కన్నన్ పిక్స్, వీడియోల‌తో కూడా సంద‌డి చేస్తుంటుంది.

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ కూడా సాయిపల్లవి బాటలోనే నడుస్తుందంటూ, త్వరలోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని గతంలో పలు రూమర్లు, వార్తలు వచ్చాయి. కాని దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. పూజా కన్నన్ ఓ సినిమా కూడా చేసింది. కానీ అది అంతగా క్లిక్ అవ్వలేదు. తెలుగులోకి ఆ సినిమాను డబ్ కూడా చేయలేదు. దీంతో పూజ కన్నన్ సినిమాల విషయంలో వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది.సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ కూడా చూసేందుకు ఒకేలా కనిపిస్తూ ఉంటారు.

Sai Pallavi Sister pooja kannan surprised everybody
Sai Pallavi Sister

స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించారు. అయితే పూజా క‌న్న‌న్ తాజాగా త‌న ఫ్యామిలీకి స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎక్క‌డికో వెళ్లి వ‌చ్చిన పూజా క‌న్న‌న్ ఫ్యామిలీ అంద‌రిని ఆనందంలో ముంచెత్తింది. సాయి ప‌ల్ల‌వి చెల్లెలిని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆమెని ముద్దుల‌తో ముంచెత్తారు. పెట్ డాగ్ అయితే పూజాపై తెగ ప్రేమ చూపించింది. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. సాయి ప‌ల్ల‌వి ఈ త‌తంగం మొత్తం త‌న ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago