Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో నటించదనే వార్తకు బలం చేకూర్చే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సాయి పల్లవి లాంటి నటి ఇక సినిమాలలో కనిపించదు అనే సరికి అందరు షాక్‌లో ఉన్నారు.
ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత నిలబెట్టుకుంది. సహజ నటనతో వేలాదిగా అభిమానుల్ని సొంతం చేపుకున్న ఈ భామ రానాతో నటించిన విరాటపర్వం, లేడీ ఓరియంటెడ్ సినిమా గార్గి అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తరువాత సాయి పల్లవి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అంతేకాదు..సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరింస్తుందని టాక్ నడుస్తుంది. సినిమాలకు ఎందుకు దూరంగా ఉందని ఆందోళన చెందుతున్న ఆమె అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలే న్యూస్ అందించింది.
సాయిపల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్.. అంతకంటే ముందు డాన్సర్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సాయిపల్లవి.. ఇండియా వచ్చి.. డాన్ మీద ఇంట్రెస్ట్ తో..నటనమీద ప్రేమతో హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే తన వృత్తికి న్యాయం చేయాలి అనుకుంటుందట ఈ మలబారు బ్యూటీ. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందట సాయి పల్లవి. అందుకే నటనకు గుడ్ బై చెప్పి.. డాక్టర్ గా సెటిల్ అవ్వబోతున్నట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీ అంతా చక్కర్లు కొడుతుంది. కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని తెలుస్తోందట సాయి పల్లవి. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.