Sai Pallavi : సోద‌రితో క‌లిసి సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ మాములుగా లేదుగా.. ఓ రేంజ్‌లో ర‌చ్చ‌..!

Sai Pallavi : లేడి ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైవిధ్య‌మైన న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. . సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ మరికొన్ని నెలల్లో పెళ్లి పీటలెక్కనుంది. వినీత్‌తో కలిసి ఆమె నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. వీరి ఎంగెజ్మెంట్‌ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి. ఎంగేజ్‌ మెంట్‌ ఈవెంట్‌ కు సంబంధించి సాయి పల్లవి, పూజ కూడా రోజుకొక వీడియోను రిలీజ్‌ చేస్తున్నారు. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. చెల్లి ఎంగేజ్‌మెంట్‌ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది సాయి పల్లవి. అలాగే ఫంక్షన్లలో హుషారుగా స్టెప్పులు, తీన్మార్‌ డ్యాన్స్‌లు వేస్తూ ఆహూతులను ఎంత‌గానో అలరిస్తుంది.

అయితే అక్కా చెల్లెళ్ల డ్యాన్స్ వీడియోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సాయి పల్లవే అనుకుంటే ఆమెను మించిపోయేలా స్టెప్పులేసింది పూజా కన్నన్‌. కాబోయే భర్త వినీత్‌తో కలిసి తీన్మార్‌ స్టెప్పులేసింది. ఇక సాయిపల్లవి కూడా ఈ జోడికి తోడవ్వడంతో ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో ఫుల్‌ జోష్‌ కనిపించింది. ఈ వీడియోలో సాయి పల్లవి, తన చెల్లి పూజా, తనకు కాబోయే భర్త వినీత్, బంధుమిత్రులు ఉన్నారు. అంతా కలిసి హుషారుగా డాన్స్ వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రం గ్రాండ్ గా జరిగింది. ఇక నెక్ట్స్ పెళ్లి డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సాయిపల్లవి మాత్రం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారు. నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ నితేష్ కుమార్ దర్శకత్వంలో రానున్న ‘రామయణం’ సీతగా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మున్ముందు క్లారిటీ రానుంది.

Sai Pallavi and her sister dance performance
Sai Pallavi

కాగా చెల్లి ఎంగేజ్మెంట్ లో కూడా సాయి పల్లవి ఎప్పటిలాగా ఎంతో సింపుల్ గా కనిపించింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను పట్టి అక్కచెల్లెళ్ల మధ్య ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. తన పెళ్లిని వాయిదా వేసుకున్న స్టార్ హీరోయిన్ చెల్లి పెళ్లిని మాత్రం దగ్గరుండి మరీ జరిపిస్తోంది. మ‌రి సాయి ప‌ల్ల‌వి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago