Sai Dharam Tej : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై 70వేల ఓట్ల తేడాతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం విజయోత్సహంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల అనంరతం హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్లారు. అయితే జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‍సభ సీట్లలో అన్నింట్లో గెలిచి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ ఆధిక్యంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ పట్టరాని సంతోషంలో మునిగితేలారు. ఫలితాలు వెల్లడైన వెంటనే తన మామ పవన్ కల్యాణ్‍ను కలిశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‍ను ఆనందంతో సాయి ధరమ్ తేజ్ హత్తుకున్నారు. సంతోషంతో నవ్వుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.ఇక పవన్ కల్యాణ్ కూడా మేనల్గుడిని చూసి హ్యాపీగా ఫీలయ్యారు. గట్టిగా నవ్వేశారు. ఇంతలోనే పవన్ కల్యాణ్ ను అమాంతం ఎత్తుకున్నాడు తేజ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు సాయి దుర్గ తేజ్. ‘ మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని పవన్ కల్యాణ్ గారు నా హీరో, నా గురు, నా హృదయం, అన్నింటికన్నా ముఖ్యం నా సేనాని’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. మామా అల్లుళ్ల సంబరం మాములుగా లేదంటూ మెగాభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. తేజ్, పవన్ కలిసి బ్రో అనే సినిమాలో నటించి సందడి చేయడం మనం చూశాం.
పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. జనసేన గెలుపు కోసం పని చేశారు. ఇప్పుడు, తనకు ఎంతో ఇష్టమైన మామ పవన్ గెలుపుతో అంతులేని సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందే పవన్ గెలుపుపై ట్వీట్లు చేశారు తేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం, భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని పోస్ట్ చేశారు. జగన్‍ను అధఃపాతాళానికి తొక్కేస్తానని పవన్ గతంలో సవాల్ చేసిన వీడియోను మళ్లీ షేర్ చేశారు సాయి తేజ్. “చెప్పాడు.. చేశాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ రాసుకొచ్చారు. పవన్ విజయంతో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, అల్లు అర్జున్ లు జనసేన అధిపతికి విషెస్ తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…