Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్‌గా విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.తన కెరీర్‌లోనే బడా సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా తనని కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ నే యువకుడిని స్వయంగా కలిసినట్లు మెగా హీరో చెప్పాడు. ఫోన్ నంబర్ ఇచ్చానని, అతనికి ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానని తెలిపాడు. ఈ వీడియో వైరల్ కాగా.. అతన్ని కాపాడిన వ్యక్తి మాత్రం అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నాడు.
యాక్సిడెంట్ తర్వాత మెగా హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరూ తనతో మాట్లాడలేదన్నాడు. కానీ యూట్యూబ్ వీడియోల్లో రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని, చిరంజీవి రూ. 5 లక్షలు ఇచ్చారని ఎన్నో వార్తలు వచ్చాయి. సాయి దరమ్ తేజ్ కూడా తనకు ఎల్లప్పుడు అండగా ఉంటానని మాట ఇచ్చినట్టు కూడా హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అయితే సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు అబ్దుల్ వరకు చేరడంతో అతను మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను కూడా ఆ వీడియో చూశాను. ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ లేదా ఆయన టీమ్ ఎవరూ నన్ను కలవలేదు. నంబర్ కూడా ఇవ్వలేదు.

అప్పుడు సీఎమ్ఆర్‌లో పని చేసేవాడిని. కాని ఆ ఫేక్ న్యూస్ వల్ల అక్కడ టార్చర్ భరించలేకపోయా. చాలా మంది వచ్చిన నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడుగుతుండటంతో జాబ్ మానేశా. ఆ తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు అమెజాన్‌లో డ్రైవింగ్ చేస్తున్నా’ అని తెలిపాడు అబ్దుల్. అయితే సాయిధరమ్ తేజ్ కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని చెప్పాడు. కానీ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్ర్పెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. ఫేక్ న్యూస్ వలన నాకు నష్టం తప్ప లాభమేమి జరగలేదని అబ్ధుల్ అన్నాడు.