Sachin Tendulkar : భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో అఫ్గానిస్థాన్ జట్టు దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాపై ఈ జట్టు ఓటమి పాలు కావడంతో సెమీస్ రేసు నుండి తప్పుకున్నట్టు అయింది. అయితే పెద్ద పెద్ జట్లకి షాకిచ్చన ఆఫ్ఘనిస్తాన్… ఆడిన ప్రతి మ్యాచ్‌లోను గట్టి పోటి ఇచ్చి క్రికెట్ ప్రపంచం చూపును తమవైపుకు తిప్పుకుంది. వరల్డ్ కప్ ప్రారంభంలో చివరి రెండు స్థానాల్లో ఉండే జట్టు అఫ్గాన్ జట్టు అనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, మ్యాచ్ లు జరుగుతున్నాకొద్దీ అఫ్గాన్ జట్టు పోరాటపటిమను చూసి ప్రత్యర్థి జట్లుసైతం ప్రశంసలు కురిపించాల్సి వచ్చింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వివాద రహితుడిగా పేరుగాంచిన విషయం తెలిసిందే. సచిన్ ను ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఎంతో అభిమానిస్తారు. అయితే రీసెంట్‌గా సచిన్ ఆఫ్ఘనిస్థాన్ జట్టును కలిశాడు. ఆస్ట్రేలియాతో తలపడడానికి ముందు ఆ జట్టు ముంబైలో ఉంది. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం ముంబయిలో ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ శిబిరాన్ని సచిన్ సందర్శించాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా ముచ్చటించాడు. వారిని పేరుపేరునా పలకరించి ఉత్తేజం నింపాడు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్, సలహాదారు అజయ్ జడేజాలతోనూ సచిన్ ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించాడు.
సచిన్ అఫ్గాన్ జట్టు సభ్యులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సచిన్ తో సమావేశంపై అఫ్గాన్ జట్టు స్పిన్నర్ రషీద్ ఖాన్ మాట్లాడారు. సచిన్ తో మాట్లాడిన క్షణం తనతో పాటు మొత్తం జట్టు సభ్యుల ఫీలింగ్ ఏమిటో వివరించాడు.వాంఖడేలో సచిన్ టెండూల్కర్ ను కలవడం ఒక భిన్నమైన అనుభూతి. అది చాలా ప్రత్యేకమైన సమయం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు మా కుర్రాళ్లకు కొత్త శక్తి వచ్చినట్లయింది. సచిన్ ను కలవాలని చాలా మంది ఆటగాళ్లకు ఉంటుంది.. ఇది ఒకరకమైన కల అంటూ రషీద్ అన్నారు. ఆస్ట్రేలియాతో తమ కీలక మ్యాచ్ కు ముందు జట్టును కలిసినందుకు సచిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.