Sachin Tendulkar : ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజీలాండ్ పై సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు కోహ్లీ. మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు విరాట్.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ 106బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు . తను అవుటయ్యే సమయానికి 113 బంతుల్లో 117పరుగులు చేశాడు. సెంచరీలతోనే కాకుండా విరాట్ సచిన్ పేరిట ఉన్న మరో రికార్డ్ నూ బ్రేక్ చేశారు. ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు 673 పరుగులతో సచిన్ పేరిట ఉండేది. దానిని 694 పరుగులతో ఈరోజు విరాట్ బ్రేక్ చేశాడు.
రెండు రికార్డులు కూడా సచిన్ టెండూల్కర్ సమక్షంలోనే బ్రేక్ అయ్యాయి… స్టేడియంలో సచిన్ మ్యాచ్ చూస్తుండగా విరాట్ అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డును సాధించడం ప్రేక్షకులకు మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. వన్డేల్లో తాను నెలకొల్పిన అరుదైన రికార్డును కోహ్లీ అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశాడు సచిన్.వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సాధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీని ట్విటర్ వేదికగా సచిన్ ప్రశంసించాడు. కోహ్లీని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘కోహ్లీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో నిన్ను మొదటి సారి కలిసినప్పుడు సహచర ఆటగాళ్లంతా నా కాళ్లు మొక్కాలని ప్రాంక్ చేశారు. ఆ రోజు నేను తెగ నవ్వుకున్నాను. ఆ రోజు నువ్వు నా కాళ్లు మొక్కకపోయినా.. ఈ రోజు ఆటపై నీకున్న పిచ్చి, నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్. ఓ కుర్రాడు వరల్డ్ క్లాస్ ప్లేయర్‌లా ఎదగడం చూసిన నేను చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఓ ఇండియన్‌గా నా రికార్డ్‌ను అధిగమించావని నేను సంతోషించడం లేదు. వరల్డ్ కప్‌లో సెమీస్ వంటి బిగ్ మ్యాచ్‌లో నా హోమ్ గ్రౌండ్‌లో ఈ రికార్డ్ అధిగమించడం నా సంతోషాన్ని డబుల్ చేసింది.’అని సచిన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సచిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైర్‌గా మారింది.