దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్, తారక్‌లు అల్లూరి, భీమ్ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ఆలియాభట్ లు ఇందులో కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ మధ్య కాలంలో RRR మూవీ గురించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. RRR మూవీ ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా RRR ను పక్కన పెట్టి ఆస్కార్ నామినేషన్‌కు గుజరాతీ మూవీ చెల్లోను పంపించింది. దీంతో వివాదం మొదలైంది.
అయితే ఇండియా నుంచి నామినేట్ అవకపోయినా.. ఆస్కార్ కోసం అమెరికాలో బాగానే లాబీయింగ్ చేస్తున్నారట. ఇందుకు గాను రూ.50 కోట్లను ఖర్చు చేస్తున్నారట. ఈ విషయమై రాజమౌళి టీమ్ చాలా పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఏ విభాగంలో అయినా సరే ఒక ఆస్కార్‌ను కచ్చితంగా తెచ్చుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నదట. కనుకనే లాబీయింగ్ కోసం అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఆ మొత్తంతో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీనే తీయవచ్చని చెబుతున్నారు.
అయితే RRRకు ఆస్కార్ వస్తే రాజమౌళి స్థాయి మరింత పెరుగుతుందని.. దీంతో ఆయన తీసే సినిమాలకు మార్కెట్ పెరుగుతుందని అంటున్నారు. కనుకనే ఎట్టి పరిస్థితిలోనూ ఆస్కార్ వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట. ఇక RRRకు కనీసం ఏ విభాగంలో లేకపోయినా.. ఏదైనా ఒక కన్సొలేషన్ లేదా స్పెషల్ జ్యూరీ అవార్డు అయినా ఇవ్వాలని కోరుతున్నారట. ఈ క్రమంలోనే RRR మూవీ ఆస్కార్ లకు నామినేట్ అవుతుందా.. నామినేట్ అయితే ఆస్కార్ వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైనా ఒక అంశంలో ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ లాబీయింగ్ ఏ మేర ఫలిస్తుందో చూడాలి.