Roja : మరికొద్ది రోజలలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని… ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని పంచ్‌లు వేసింది రోజా. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ను పవన్ ఏమన్నారో… పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్లు మర్చిపోయారని అన్నారు. సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమనే… అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? 24 సీట్లకే తోక ఊపుకుంటూ చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావ్ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలన్నారు. మరోవైపు 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు ఉన్నారని రోజా అన్నారు. ఏపీ సీఎం జగన్ ను ఒంటరిగా ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు. వాళ్లలో వాళ్లకే గందరగోళం, ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారని చెప్పారు.
![Roja : పవన్‌ని బకరా చేసిన చంద్రబాబు.. జనసేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు Roja non stop satires on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2024/02/roja-2.jpg)
పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు సీట్లు తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు , పవన్ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. టీడీపీ, జనసేన కలిపి 118 స్థానాలను ప్రకటించారు. అందులో టీడీపీకి 94 సీట్లు కేటాయించగా, జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో ఎందుకు చెప్పలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.