Roja : ఏపీ అసెంబ్లీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు, ముగ్గురిని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు మీసాలు మెలితిప్పుడూ, తొడలు కొడుతూ సవాళ్లు విసురుకోవడం ఎంత రసవత్తరంగా మారిందో మనం చూశాం. అయితే ఈ సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలేయడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. బావ కళ్లలో ఆనందం కోసం బాలయ్య మీసాలు మెలేస్తున్నారని ఆరోపించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తించారన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బాలకృష్ణకి సూటిగా చెప్తున్నా.. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదంటూ మంత్రి రోజా అన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటారని సెటైర్లు వేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరన్నారు.పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని అన్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్ విసిరేసి, బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారని తెలిపారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందని ఆరోపించారు మంత్రి రోజా. తన తండ్రి ఎన్టీఆర్‌కు అవమానం జరిగినప్పుడు బాలయ్య ఎందుకు స్పందించలేకపోయాడు. ఇప్పుడు బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నారని అన్నారు రోజా. బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడని అన్నారు.
తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం సమస్యలపై ఫైటింగ్ చేశారా? అని మీడియా ముందు ప్రశ్నలు అడిగారు రోజా. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ అనే విషయాలను టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు రోజా. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే శాసనసభలో బాలకృష్ణ మీసం తిప్పారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే స్కిల్ స్కామ్‌పై సభలో చర్చకు సిద్ధంగా ఉండాలి. ఈ తొమ్మిదేళ్లలో ఏనాడైనా ప్రజల సమస్యలపైన గానీ, హిందూపురం నియోజకవర్గం గురించి గానీ అసెంబ్లీలో చర్చించారా?. బాలకృష్ణకు సభలో మైక్ ఇస్తాం. ఈ స్కిల్ స్కామ్ చంద్రబాబు ఏం చేశారో? చేయలేదో? చెప్పమనండి. చంద్రబాబు అరెస్ట్‌పై అసెంబ్లీలో కచ్చితంగా చర్చకి వస్తుంది. అప్పుడు బాలయ్యకి మాట్లాడే అవకాశం ఇవ్వమని మేమే స్పీకర్ ను కోరతాం. అప్పుడు మాట్లాడమనండి అంటూ రోజా కోరడం ఆసక్తి రేపుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…