Roja : మంత్రి రోజాపై తెలుగుదేశం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన విమర్శలపై ఎంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందో మనం చూశాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బాబు కుటుంబ సభ్యులు, సతీమణి, కోడల బ్రహ్మణిల గురించి రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండారు శృతి మించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ఆమెను కించపరిచేలా బండారు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తరపున కేవలం మహిళా కమిషన్ ఛైర్మన్ మాత్రమే అధికారికంగా స్పందించారు.బండారు చేసిన వ్యాఖ్యలపై రోజాకు అనుకూలంగా వైసీపి, బండారుకు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాలు నిత్యం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రోజాకు మద్దతుగా సినీ నటి ఖుష్బూ రెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు.
ఖష్బూు తర్వాత మహారాష్ట్ర అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా స్పందించారు. రోజా తరపున మాట్లాడారు.టీడీపీ నాయకుడి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ తర్వాత నటి రాధిక శరత్ కుమార్, మీనాలు కూడా వీడియోలు విడుదల చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రోజా, బండారు వివాదంలో టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా సినీతారలు ఏకమయ్యారు.అదే సమయంలో వైసీపీలో ముఖ్యమైన మహిళా నాయకురాళ్లు ఎవరు ఇంతకాలం మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి రోజాకు వైసీపీలో కీలక స్థానం ఉంది. బండారుతో రోజా వివాదం నేపథ్యంలో మహిళా మంత్రులు ఎవరు స్వచ్ఛంధంగా ఖండించకపోవడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది.
ఇక రోజాపై బండారు విమర్శలు తర్వాత ఆమె చాలా రియలైజ్ అన్నట్టు తెలుస్తుంది. గతంలో రోజా.. రేణూ దేశాయ్‌పై తీవ్ర విమర్శలు చేయగా, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ,రేణూ దేశాయ్ ఎంత బాధపడ్డారనేది ఇప్పుడు తనకు అర్ధమై ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే కష్టపడి పైకి వచ్చిన తనపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటంపై దారుణమని రోజా మండిపడ్డారు. ఒక మంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసే దుర్మార్గులు బయట తిరగకూడదని.. బండారు సత్యనారాయణమూర్తికి తానేంటో చూపిస్తానని రోజా సవాల్ చేశారు.