Roja : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలసిందే. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాప్తాడు సిద్ధం సభ సూపర్ హిట్ అయ్యింది. వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఊహించని దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు, అభిమానులు సిద్ధం సభకు తరలివచ్చారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు సుమారు పదిలక్షల మంది జనం వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదో రికార్డుగా పేర్కొంటున్నాయి. మరోవైపు ఎండను సైతం లెక్కచేయక తరలివచ్చిన కార్యకర్తలను చూసి జగన్ సైతం.. కొత్త ఉత్సాహంతో కనిపించారు.
కార్యకర్తలను, అభిమానులతో విజిల్స్ కొట్టించేలా ప్రత్యర్థి పార్టీలపై మాస్ పంచులేశారు. ఇదే సమయంలో..ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోందని జగన్ అన్నారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని అభివర్ణించారు. ఇక కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఆసాంతం.. ఈలలు, విజిల్స్‌తో కార్యకర్తలు మోతెక్కించారు.ఇదే సభలో కుర్చీ మడతపెట్టి మాటను మరోసారి ప్రత్యర్థులపై జగన్ ప్రయోగించారు. ఏపీ ప్రజలు చొక్కా మడతేసి, కుర్చీలు మడతపెట్టి.. చీపుర్లతో టీడీపీ పార్టీని ఊడ్చేయాలంటూ జగన్ పిలుపునిచ్చారు.ఇంటి బయట సైకిల్.. ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్ అంటూ జగన్ వేసిన సెటైర్లకు కార్యకర్తల నుంచి విజిల్స్ వినిపించాయి.
మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయల్దేరింది మొదలుకుని పుట్టపర్తి ఎయిర్‌పోర్టు దగ్గర దిగి.. సభావేదికకు చేరుకునే వరకూ అడుగడుగునా నిరసన సెగలే తగిలాయి. దీంతో ఇది ఎన్నికల సభా లేకుంటే.. నిరసన సభా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సిద్ధం సభలో ఏపీ మంత్రి రోజాకి ఊహించని సంఘటన జరిగింది. మంత్రి రోజా అని కూడా చూడకుండా జగన్ సెక్యూరిటీ ఆమెని పక్కకి నెట్టగా, ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి అని కూడా చూడకుండా అలా పక్కకి నెట్టేయడం ఏంటని కొందరు మండిపడుతున్నారు.