Roja : గత సంవత్సర కాలంగా తో కలిసి నడుస్తామని సూచనప్రాయంగా పవన్ చెబుతున్నప్పటికీ నిన్న రాజమండ్రి వేదికగా ఈ విషయం పై స్పష్టమైన ప్రకటన చేశారు.దాంతో రెండు పార్టీల అభిమానులలోనూ మిశ్రమ స్పందనలు కలిగాయి. అయితే పవన్ కళ్యాణ్‌ని రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే… పవన్ కల్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నారు.. గతంలో చెప్పులు చూపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనని తాను చెప్పుతో కొట్టుకుంటాడా? లేదా పక్కన వాళ్లని కొడతాడా అనేది ఎవరికి అర్ధం కావడం లేదని పేర్కొంది.
జనసేన అనే పార్టీని చంద్రబాబు కోసమే పెట్టినట్టు ఉంటుంది. కనీసం పార్టీ పెద్దలుగా ఉన్న నాగబాబు, నాందెండ్ల మనోహర్ ని కూడా సంప్రదించకుండా తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు స్పష్టం చేశాడు. అయితే చంద్రబాబుతో ప్యాకేజీ కోసం పొత్తు మరోవైపు బీజేపీ తో కూడా తన పోత్తు కొనసాగిస్తానంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీతో పొత్తులో ఉంటూ, వారితో చర్చించకుండానే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ అన్నారని, ఇదెక్కడి పొత్తు ధర్మం అని ఆమె లాజిక్ తీశారు. బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందేమో అంటూ మాట్లాడుతున్నారని.. పవన్ కల్యాణ్ కి నిజంగానే తిక్క ఉందని, ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో ఆయన లెక్క కూడా బాగానే తేలిందని చెప్పారు రోజా.
జనసేన పొత్తు వ్యవహారం తెలుగుదేశం క్యాడర్ పూర్తిస్థాయిలో ఆనందిస్తుంటే, జనసేన లో మాత్రం కొందరు పవన్ ముఖ్యమంత్రి కాలేడు కదా అన్న అభిప్రాయంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే అధినేత నిర్ణయమే ఫైనల్ అన్న అభిప్రాయానికి మెజారిటీ అభిమానులు, కార్య కర్తలు వచ్చినట్లుగా వారి సోషల్ మీడియా స్పందన చూస్తుంటే అర్థమవుతుంది. పవన్ పొత్తు నిర్ణయం జనసేన అభిమానుల్ని ఎంత బాధ పెట్టిందో తెలియదు గానీ అధికార వైసిపి నేతలను, శ్రేణులు మాత్రం తీవ్ర నిరుత్సాహపరచినట్టుగా పవన్ పై వారు చేస్తున్న మూకుమ్మడి దాడి బట్టి తెలుస్తుంది.