Rohit Sharma : భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న విషయం తెలిసిందే. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు రోహిత్ శర్మను సత్కరించి ప్రసాదాలను అందించారు. రోహిత్ శర్మ చుట్టు అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. వారికి రోహిత్ శర్మ అభివాదం కూడా చేశాడు. అయితే ఆ సమయంలో కొంత ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఫ్యామిలీతో వచ్చిన రోహిత్‌ని అందరు చుట్టుముట్టడంతో రోహిత్ చాలా చిరాకుగా ఫేస్ పెట్టాడు.
రోహిత్ శర్మ స్వామి వారిని దర్శించుకోవడం ప్రస్తుతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2019లో రోహిత్ శర్మ చివరిసారిగా తిరులమ శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడు తిరుమలకు వచ్చాడు. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లు జరగనున్నాయి. ఈ రెండు టోర్నీల్లోనూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండనున్నాడు. మెగా టోర్నీల్లో భారత్ సక్సెస్ అవ్వాలని దేవుడిని ప్రార్థించేందుకు వచ్చి ఉంటాడని ఫ్యాన్స్ అంటున్నారు. 2019లో వన్డే ప్రపంచకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీకి ముందు కూడా రోహిత్ శర్మ శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో శతకాల మోత మోగించాడు.
5 శతకాలు బాదిన రోహిత్ శర్మ ఒక ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ తో కలిసి సమానంగా ఉన్నాడు. వీరిద్దరు ఆరేసి సెంచరీలు చేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ విశ్రాంతిలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో వన్డే ఆడనున్నాడు. ఆ తర్వాత భారత్ వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. అంతకముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్ ఫాంలో ఉంటే ఏ టీం అయిన సరే ఇంటిబాట పట్టాల్సిందే. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది.