Rohit Sharma Mumbai House : రోహిత్ శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పరిమిత ఓవర్లు మరియు టెస్ట్‌లలోను రోహిత్ అదరగొడుతున్నాడు. వైట్-బాల్ క్రికెట్‌లో అత్యంత విధ్వంసక బ్యాటర్‌లలో ఒకడు. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బౌలర్‌లను కూడా వణికిస్తాడు. ముంబైకి చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మైదానంలోనే కాకుండా దాని వెలుపల కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని బెల్ట్ కింద అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో, రోహిత్ వార్షిక ఆదాయాలు విపరీతంగా పెరిగాయి. వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్న రోహిత్ – అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను కలిగి ఉన్నాడు. దాదాపు రూ. 214 కోట్ల నికర విలువను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది.
రోహిత్ శర్మ 53 అంతస్తులు ఉన్న అహుజా టవర్స్‌లో 29 వ ఫ్లోర్ కొనుగోలు చేశాడు. అరేబియా సముద్రం యొక్క అందమైన దృశ్యం ఇంటి నుండి కనిపిస్తుంది. ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. ముంబైలోని ఖరీదైన ఇంట్లో తన భార్య రితికా సజ్దేహ్ మరియు కుమార్తె సమైరాతో కలిసి ఉంటాడు. ఇంటిలోపల దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఇంద్ర భవనం మాదిరిగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ప్రస్తుత భారత జట్టుకి కెప్టెన్‌గా ఉన్నారు. అలానే వరల్డ్ కప్‌లో రాణిస్తున్నారు.
గత శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల విశ్రాంతి లభించింది. దాంతో హిట్ మ్యాన్ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపాడు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో పుణేలోనే ఉండటంతో రోహిత్ శర్మ తన సొంత కారులో అక్కడికి బయల్దేరాడు. అయితే అతను కారును వేగంగా నడిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గంటకు 200 కిలోమీటర్ల నుంచి 215 కిలోమీటర్ల వేగంతో హిట్ మ్యాన్ కారు నడిపినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ విరుద్దంగా అతి వేగంగా దూసుకెళ్లిన రోహిత్ శర్మ కారుపై మూడు చలాన్లు విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.