Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అతను ఎన్నో రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అయితే రెండు నెలల క్రితం ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఊహించినట్లుగానే రోహిత్ శర్మ అభిమానులకు, సపోర్టర్స్‌కు అంతగా రుచించలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరారు. అయితే, ప్రజల భావోద్వేగాలను పక్కన పెడితే, ముంబై ఇండియన్స్ పురోగతిని దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎమ్ఐ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల వెల్లడించారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడని ముంబై కోచ్ మార్క్ బౌచర్ అన్నారు. “ముంబైకి 5 ట్రోఫీలు అందించడం చాలా పెద్ద విషయం. అవును, ఎంఎస్ ధోనీకి సమానంగా టైటిల్స్ ఉండొచ్చు. కానీ, రోహిత్‌పై కెప్టెన్సీ భారం కారణంగా అతను ఆటగాడిగా రాణించలేకపోయాడు. బ్యాటర్‌గా రోహిత్ శర్మ జట్టుకు మరింత మెరుగ్గా రాణించగలిగాడు. కానీ, కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఈ కారణంగానే అతను బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు మరింత బెటర్‌గా రాణించాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించటం జరిగింది” అని కోచ్ మార్క్ బౌచర్ తెలిపారు.
రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామో ఆయన అభిమానులకు ఈ కోణం కనిపించదు. అభిమానులు ఎమోషనల్‌గా ఆలోచిస్తారు. ఇది క్రికెట్ నిర్ణయం. ఉద్వేగానికి లోనుకాకుండా రోహిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించండి” అని ముంబై కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే సమయంలో ఆర్సీబీ రోహిత్‌ని తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టుని నడిపించే నాయకుడు సరైన నాయకుడు లేడు. కోహ్లీ తప్పుకున్నాక డుప్లెసిస్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా తప్పుకోవడంతో రోహిత్‌ని కెప్టెన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. రోహిత్ కి ఐపీఎల్‌లో కెప్టెన్ గా మంచి ట్రాక్ ఉంది కాబట్టి ఆర్సీబీ.. రోహిత్‌కి భారీ మొత్తం చెల్లించి తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.