Rohit Sharma Bowling : ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపోతోంది. అరంగేంట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా మంచి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి, ఆ తర్వాత పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్ టీంతో ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలని కోరుకుంటుంది. అయితే ఆసియా కప్ లో అన్ని జట్లపై విజయం సాధించిన భారత్.. ఒక్క బంగ్లాపై మాత్రం ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. దీంతో ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదని భావించి.. నెట్స్ లో కఠోర సాధన చేస్తోంది.
ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ ప్రత్యేకంగా సిద్దమయ్యాడు. సరికొత్త ప్లాన్ తో రోహిత్ బరిలోకి దిగాడు. రోహిత్ నెట్స్ లో బ్యాటింగ్ కు బదులుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడమే. సాధారణంగా రోహిత్ నెట్స్ లో బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలా బౌలింగ్ చేస్తాడు. పైగా ఆసియా కప్ లో బంగ్లాపై టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. అందుకు తగ్గట్లుగానే ప్లాన్లు కూడా రెడీ చేస్తోంది టీమిండియా. మిగతా జట్లలో పార్ట్ టైమ్ స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. ఆసీస్ లో మాక్స్ వెల్, బంగ్లాకి షకీబ్, ఇంగ్లాండ్ కు మెుయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ టీమిండియాకు మాత్రం అలాంటి ఆటగాడు లేడు. గతంలో యువరాజ్ సింగ్ టీమిండియాకు ఉండగా.. అతడి తర్వాత ఆ స్థానాన్ని జడేజా కొంత మేరకు భర్తీ చేశాడు.
కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లేకుండా పోయింది. ఇక ఈ సమస్య గురించే వరల్డ్ కప్ ముందు మీడియా సమావేశంలో మాట్లాడాడు రోహిత్. పైగా అవసరమైతే తాను కూడా బౌలింగ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో రాబోయే మ్యాచ్ ల్లో రోహిత్ బౌలింగ్ చేసి.. సర్ప్రైజ్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 20 ఏళ్ల వయస్సులో రోహిత్ బౌలింగ్ చేసి అదరహో అనిపించాడు. జయసూర్య లాంటి బ్యాట్స్‌మెన్స్ ని సైతం కట్టడి చేసి అదరహో అనిపించాడు. చాలా రోజుల తర్వవాత ఇలా రోహిత్ తిరిగి
బౌల్ పట్టుకోగా, రానున్న మ్యాచ్‌లలో మళ్లీ బౌలింగ్ చేస్తాడా అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
https://youtube.com/watch?v=caOJRK_AyuA