Rohini: జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది రోహిణి. ముందు పలు టీవీ సీరిలయ్స్ లో నటించిన రోహిణి జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రోహిణి నటన, మాట్లాడే విధానం తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చేశాయి. గతేడాది బంగార్రాజు సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి వెంటే ఉండే పాత్రలో నటించింది రోహిణి. వరస సినిమాలు కూడా చేస్తుంది ఈ లేడీ కమెడియన్. అయితే తాజాగా ఈమె సర్జరీ కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్లు దాదాపు 10 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఈమె కాలులో ఉన్న రాడ్‌ను తొలిగించారు. ఈ విషయాన్ని రోహిణి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చింది
ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి రాడ్ వేశారని.. ఇప్పుడు దాన్ని తీసివేశారని తెలిపింది రోహిణి. ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందని.. దేవుడి దయవల్ల అంతా బాగానే జరిగిందని ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చింది. యూట్యూబ్ వీడియాలో రోహిణి మాట్లాడుతూ.. ‘ఐదు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నా కాలులో రాడ్ వేశారు. ఆ రాడ్ తొలగించుకోవడానికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యాను. అయితే రాడ్ స్కిన్ కి బాగా అటాచ్ అయ్యిందని.. తీయడానికి వీలు పడదని వారు అన్నారు.
అయితే యాక్సిడెంట్ అయినపుడు చికిత్స చేసిన డాక్టర్ ని సంప్రదించాను. ఈ క్రమంలోనే నేను సర్జరీ కోసం విజయవాడకు వచ్చాను. సర్జరీ కోసం పదిగంటల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. మొత్తానికి కాలులో ఉన్న రాడ్ ని తొలగించారు. ఆరు వారాల పాటు నన్ను రెస్ట్ తీసుకోవాలని.. కాలుపై ఎలాంటి బరువు పెట్టవొద్దని వారు నాకు సూచించారు. ఆరోగ్యం పూర్తిగా నయం అయిన తర్వాత సెట్ లోకి అడుగుపెడతా’ అని రోహిణి తెలిపింది. మొత్తానికి రోహిణి ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆమె అభిమానుఉలు కూడా సంతోషంగా ఉన్నారు. రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌లో ఈమె నటకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో పాటు ఈమె పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు తలుపులు తడుతున్నాయి
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…